Microsoft® Office Language Interface Pack 2013 – తెలుగు
Microsoft Office Language Interface Pack 2013 - తెలుగు అనేక Microsoft Office 2013 అనువర్తనాల కోసం అనువదించిన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ని అందిస్తుంది.
ముఖ్యమైనది! దిగువ ఉన్న భాషను ఎంచుకోవడం వల్ల పూర్తి పేజీ కంటెంట్ ఆ భాషకు డైనమిక్ గా మారుతుంది.
సంస్కరణ:
2013
ప్రచురించబడిన తేదీ:
25/2/2015
ఫైల్ పేరు:
languageinterfacepack-x64-te-in.exe
languageinterfacepack-x86-te-in.exe
ఫైల్ పరిమాణం:
13.9 MB
13.8 MB
- Microsoft Office Language Interface Pack 2013 - తెలుగు కింద ఉన్న Microsoft Office 2013 అనువర్తనాలకు అనువదించిన వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ని అందిస్తుంది:
- Microsoft Excel® 2013
- Microsoft OneNote® 2013
- Microsoft Outlook® 2013
- Microsoft PowerPoint® 2013
- Microsoft Word® 2013
Microsoft Office Language Interface Pack 2013 - తెలుగుని ఉపయోగించడం ద్వారా వినియోగదారులు Office అనువర్తనాల యొక్క సంస్కరణలకు మద్దతుని కలిగి ఉన్న వాస్తవ ఇన్‌స్టలేషన్ భాషలో పని చేయవచ్చు మరియు - తెలుగులో అటువంటి అనువర్తనాల కోసం ఆదేశాలను మరియు ఎంపికలను వీక్షించవచ్చు.
Microsoft Office Language Interface Pack 2013 యొక్క ఇన్‌స్టలేషన్ సమయంలో, వినియోగదారు ఇంటర్‌ఫేస్ యొక్క భాషను మార్చడానికి వినియోగదారులను అనుమతించే ఫైల్‌లు గమ్య హార్డ్ డిస్క్‌కు కాపీ చేయబడతాయి. ఇన్‌స్టలేషన్ తర్వాత, Office 2013 అనువర్తనాలు మరియు Microsoft Office 2013 భాషా సెట్టింగ్‌ల అనువర్తనంలోనే Microsoft Office Language Interface Pack 2013 - తెలుగు సామర్థ్యాలు మరియు సంబంధిత ఎంపికలు అందుబాటులో ఉంటాయి.
మద్దతుగల ఆపరేటింగ్ సిస్టమ్స్
Windows 7, Windows 8
- Microsoft Windows 7 - 32 లేదా 64 బిట్ OS
Microsoft Windows 8 - 32 లేదా 64 బిట్ OS
గమనిక: దయచేసి మీ భాష కోసం ఆప్టిమల్ మద్దతుని నిర్ధారించడానికి మీ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం తాజా సర్వీసు ప్యాక్‌ని వ్యవస్థాపించాలని నిర్ధారించుకోండి.
సాఫ్ట్‌వేర్ Microsoft Excel, Microsoft OneNote, Microsoft Outlook, Microsoft PowerPoint లేదా Microsoft Wordని కలిగి ఉన్న లేదా Microsoft Office Language Interface Pack 2013 - తెలుగుకి మద్దతు ఇచ్చే ఏదైనా Office 2013 సూట్ లేదా వ్యక్తిగత సంస్కరణ. గమనిక: దయచేసి మీ Microsoft Office ఉత్పత్తుల కోసం తాజా Microsoft Office సర్వీసు ప్యాక్‌లను వ్యవస్థాపించారని నిర్ధారించుకోండి. ఇది ఉత్తమమైన వినియోగదారు అనుభవాన్ని నిర్ధారిస్తుంది.
కంప్యూటర్ మరియు ప్రాసెసర్ SSE2 మద్దతు లేదా అంత కంటే ఎక్కువతో 1 GHz ప్రాసెసర్; 2 GB RAM లేదా అంత కంటే ఎక్కువ
డిస్క్ స్థలం వ్యవస్థాపించిన Office 2013 అనువర్తనాల ద్వారా ఉపయోగించబడుతున్న హార్డ్ డిస్క్ స్థలానికి అదనంగా,
- 3 GB హార్డ్ డిస్క్ స్థలం అందుబాటులో ఉండాలి.
- మీరు Microsoft Office Language Interface Pack 2013 - తెలుగుతో ఉపయోగిస్తున్న కొన్ని Office 2013 అనువర్తనాల వలె అన్ని ఇతర సిస్టమ్ ఆవశ్యకతలు ఒకే విధంగా ఉంటాయి.
Windows Language Interface Pack మీ ఆపరేటింగ్ సిస్టమ్ మరియు సాఫ్ట్‌వేర్ అనువర్తనాలకు మద్దతు కలిగి ఉన్న ఆప్టిమల్ భాష కోసం తాజా Windows 7 లేదా Windows 8 Language Interface Packని వ్యవస్థాపించాలని సిఫార్సు చేయబడింది.
మానిటర్ రిజల్యూషన్ ప్రకటన DPI సెట్టింగ్‌లు 1366 x 768 రిజల్యూషన్‌లో ఆప్టిమల్‌గా చదవడానికి అనేక అక్షరాకృతులు సృష్టించబడ్డాయి. మీ భాష అక్షరాకృతిని చదవడంలో మీకు ఇబ్బంది ఉంటే, దయచేసి అవసరమైతే మీ ప్రదర్శన సెట్టింగ్‌లను ఈ రిజల్యూషన్‌కు లేదా అంతకంటే ఎక్కువ దానికి నవీకరించండి. దయచేసి గమనించండి: మేము Windows స్వయంసిద్ధ DPI సెట్టింగ్ - 96 DPIలో Office 2013 అనువర్తనాలను ఉపయోగించమని మీకు సిఫార్సు చేస్తున్నాము. 120 DPI సెట్టింగ్‌ని ఉపయోగించి Office వ్యాఖ్య పరిమాణాలను పెంచడం ద్వారా కొన్ని Office అనువర్తనాలలో తక్కువ Office వినియోగదారు అనుభవాన్ని కలిగించవచ్చు.
ప్రాంతీయ మరియు భాషా ఎంపికలు అదనంగా Microsoft Office Language Interface Pack 2013 - తెలుగు యొక్క భాషకు సెట్ చేసిన నియంత్రణా పానెల్‌లో ఉన్న అన్ని ప్రాంతీయ మరియు భాషా ఎంపికలు సిఫార్సు చేయబడ్డాయి.
- ఈ దిగుమతిని వ్యవస్థాపించడానికి:
- దిగుమతి చేయి మీటని (ఎగువ ఉన్న) క్లిక్ చేయడం ద్వారా మీ హార్డ్ డిస్క్‌కి ఫైల్‌ని సేవ్ చేయడం ద్వారా LanguageInterfacePack.exe ఫైల్‌ని దిగుమతి చేయండి.
- స్థాపక ప్రోగ్రామ్‌ని ప్రారంభించడానికి మీ హార్డ్ డిస్క్‌లో ఉన్న LanguageInterfacePack.exe ప్రోగ్రామ్ ఫైల్‌ని డబుల్-క్లిక్ చేయండి.
- ఇన్‌స్టలేషన్‌ని పూర్తి చేయడానికి తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.
- మీ Microsoft Office 2013 Language Interface Pack కోసం నన్నుచదువు ఫైల్‌ని వ్యవస్థాపిస్తే, దీన్ని ఇక్కడ కనుగొన వచ్చు C:\Program Files\Common Files\microsoft shared\OFFICE15\1098\LIPread.htm.
- Office 2010 Language Interface Pack తో Office 2010ని లేదా Office 2010 Language Interface Pack తో Office 2010కు మునుపటి ఎడిషన్‌ని అప్‌గ్రేడ్ చేయడానికి మద్దతు లేదు. మీరు Office 2013 Language Interface Pack తో Office 2013 కు Office 2010 యొక్క మీ ఆధార ఇన్‌స్టలేషన్‌ని అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే, మీరు వీటిని చేయాలి:
- Office 2010 Language Interface Pack వ్యవస్థాపనని తీసివేయండి.
- Office 2013 స్థాపకాన్ని అమలు చేసి, అప్‌గ్రేడ్ చేయి ఎంపికను ఎంచుకోండి.
- Office 2013 స్థాపకం పూర్తయినప్పుడు, Office 2013 Language Interface Packని వ్యవస్థాపించి, నిర్మితీకరించండి.
"Microsoft Office Activation Wizard" వ్యాఖ్యలో పూర్తి ఇన్‌స్టలేషన్ కోడ్‌ని చదవడంలో మీకు సమస్య ఉంటే లేదా మీ Microsoft Office Language Interface Pack 2013ని ఉపయోగించేటప్పుడు పూర్తి ఇన్‌స్టలేషన్ కోడ్ సరిగ్గా ప్రదర్శించబడకుంటే, దయచేసి విజార్డ్‌ని రద్దు చేసి, మీ Microsoft Office ఉత్పత్తిని క్రియాశీలం చేయడానికి మీ ఆధార భాష ఉత్పత్తికి మారండి.
ఉపయోగించడానికి సూచనలు:
మీ వినియోగదారు ఇంటర్‌ఫేస్‌ను Microsoft Office Language Interface Pack 2013 – తెలుగుకు మార్చడానికి, ఈ దశలను అనుసరించండి:
- Start\All Programs\Microsoft Office\Microsoft Office Tools మెను నుండి Microsoft Office 2013 భాషా ప్రాధాన్యతలను ప్రారంభించండి.
- ప్రదర్శన మరియు సహాయ భాషలను ఎంచుకోండి కింద ఉన్న, ప్రదర్శన భాష కింద అవసరమైన భాషను ఎంచుకుని స్వయంసిద్ధంగా సెట్ చేయి మీటని క్లిక్ చేయండి.
- సవరణ భాషలను ఎంచుకోండి కింద ఉన్న, అవసరమైన భాషను ఎంచుకుని స్వయంసిద్ధంగా సెట్ చేయి మీటని క్లిక్ చేయండి.
- సరి మీటని క్లిక్ చేయండి.
మీరు ఎంచుకున్న భాష సెట్టింగ్‌లు మీరు మీ Office అనువర్తనాలను ప్రారంభించిన తదుపరిసారి ప్రభావాన్ని చూపుతాయి.
గమనిక: Microsoft Office Language Interface Pack 2013 – తెలుగు యొక్క భాషకు సహాయం మార్చబడదు. సహాయం ఎల్లప్పుడూ మీ వాస్తవ ఇన్‌స్టలేషన్ యొక్క భాషలో ఉంటుంది.
మీ ప్రదర్శన సహాయాన్ని ఎల్లప్పుడూ ఆధార భాషకు డ్రాప్‌డౌన్ జాబితాలో సెట్ చేయండి.
ఈ దిగుమతిని తీసివేయడానికి:
- అన్ని Microsoft Office ప్రోగ్రామ్‌ల నుండి నిష్క్రమించండి.
- Windows నియంత్రణా పానెల్‌లో ఉన్న ప్రోగ్రామ్‌ల మరియు విశేషాంశాల చిహ్నాన్ని డబుల్-క్లిక్ చేయండి.
- వ్యవస్థాపనని తీసివేయి లేదా ప్రోగ్రామ్‌ని మార్చు ఎంపికలో, ప్రస్తుతం వ్యవస్థాపించిన ప్రోగ్రామ్‌ల పెట్టెలో Microsoft Office Language Interface Pack 2013 – తెలుగుని క్లిక్ చేసి, ఆపై వ్యవస్థాపనని తీసివేయి ఎంపికను ఎంచుకోండి.
- తెరపై ఉన్న సూచనలను అనుసరించండి.