MICROSOFT విక్రయాలనిబంధనలు
2017న అప్‌డేట్ చేయబడింది
Microsoft యొక్క ఆన్‌లైన్ మరియు రీటైల్ స్టోర్‌లకు స్వాగతం. "స్టోర్" అంటే పరికరాలు, గేమ్ కన్సోల్‌లు, డిజిటల్ కంటెంట్, అనువర్తనాలు, గేమ్‌లు, సేవలు మరియు మరిన్నింటితో సహా ఉత్పత్తులు మరియు సేవలను బ్రౌజ్ చేయడం, వీక్షించడం, పొందడం, కొనుగోలు చేయడం మరియు రేట్ చేయడం మరియు సమీక్షించడం కోసం మీరు ఉపయోగించగల మా ఆన్‌లైన్ మరియు రీటైల్ వేదికలు. Microsoft స్టోర్, Office స్టోర్, Xbox స్టోర్, Windows స్టోర్ యొక్క ఉపయోగానికి మరియు ఈ విక్రయాల నిబంధనలు వర్తించే ఇతర Microsoft సేవలకు (సంయుక్తంగా, "స్టోర్") ఈ విక్రయాల నిబంధనలు ("విక్రయాల నిబంధనలు") వర్తిస్తాయి. ప్రాంతాలు, సాఫ్ట్‌వేర్, సాధనాలను డౌన్‌లోడ్ చేయడం మరియు సాఫ్ట్‌వేర్, సేవలు మరియు వర్తకానికి సంబంధించిన ఇతర సమాచారం (సంయుక్తంగా "సేవలు" మరియు స్టోర్‌తో పాటు "స్టోర్") వంటివి వివిధ వనరులకు స్టోర్ ద్వారా Microsoft ప్రాప్తిని అందిస్తుంది. స్టోర్‌లో Microsoft కు ఏ మాత్రం సంబంధం లేకుండా కూడా అనేక ఉత్పత్తులు, సేవలు మరియు కంటెంట్ వంటివి మూడవ పక్ష ఉత్పత్తులలో అందించబడతాయి. స్టోర్‌నిఉపయోగిస్తేలేదాస్టోర్నుండిఉత్పత్తులుమరియుసేవలనుకొనుగోలుచేస్తే, మీరుఈవిక్రయాలనిబంధనలు, Microsoft యొక్కగోప్యతాప్రకటన (గోప్యతమరియువ్యక్తిగతసమాచారంయొక్కరక్షణవిభాగాన్నిదిగువచూడండి) మరియుస్టోర్‌లోలేదాఈవిక్రయాలనిబంధనలోపేర్కొన్నవిధంగావర్తించేనిబంధనలుమరియుషరతులు, విధానాలులేదానిరాకరణలకు (సంయుక్తంగా "స్టోర్విధానాలు") మీరుఆమోదించినట్లుమరియుఅంగీకరించినట్లుపరిగణించబడుతుంది. మీరు స్టోర్ విధానాలను జాగ్రత్తగా చదవాలని మేము కోరుకుంటున్నాము. మీరు స్టోర్ విధానాలకు అంగీకరించకుంటే, స్టోర్ లేదా సేవలను ఉపయోగించలేరు.
మీ దేశం లేదా ప్రాంతంలో మేము Microsoft రీటైల్ స్టోర్‌ను కనుగొంటే, అందులో విభిన్నమైన లేదా అదనపు విధానాలు ఉండవచ్చు. Microsoft ఏ సమయంలో అయినా ముందస్తు ప్రకటన లేకుండానే విధానాలను నవీకరించవచ్చు లేదా సవరించవచ్చు.
స్టోర్యొక్కమీఉపయోగానికిసంబంధించిననిబంధనలు
1. సభ్యుల ఖాతా. స్టోర్ కోసం మీరు ఒక ఖాతాను తెరవాల్సి ఉంటే, సంబంధిత నమోదు ఫారమ్‌లో అవసరమైన విధంగా ప్రస్తుత, సంపూర్ణ మరియు ఖచ్చిత సమాచారాన్ని మాకు అందించడం ద్వారా మీరు నమోదును పూర్తి చేయవచ్చు. ఖాతాని తెరుస్తున్న సమయంలో మీరు సేవా ఒప్పందం లేదా విభిన్న ఉపయోగ నిబంధనలకు కూడా అంగీకరించాల్సి రావచ్చు. Microsoft ఖాతాని పర్యవేక్షించే అన్ని నిబంధనలకు కట్టుబడి మీరు స్టోర్‌ను మరియు స్టోర్ నుండి పొందిన కంటెంట్‌ను ప్రాప్తి చేయాలి. మరింత సమాచారం కావలంటే, దయచేసి Microsoft సేవల ఒప్పందాన్ని చదవండి. మీ ఖాతా సమాచారం మరియు పాస్‌వర్డ్ ప్రమాణాలు మరియు మీ ఖాతాలో జరిగే మొత్తం కార్యాచరణకు మీరే బాధ్యత వహించాలి.
2. చట్టవ్యతిరేకమైన లేదా నిషేధిత ఉపయోగాలు చేయకూడదు. మీరు స్టోర్ మరియు సేవలను ఉపయోగించే సమయంలో, ఎటువంటి చట్టవ్యతిరేకమైన లేదా ఈ విక్రయాల నిబంధనలు, స్టోర్ విధానాలు లేదా స్టోర్ యొక్క మీ ఉపయోగానికి వర్తించే ఏవైనా ఇతర నిబంధనలు నిషేధించిన పద్ధతిలో మీరు ఏ ఉపయోగాన్ని చేయకూడదు. Microsoft సర్వర్‌కు కనెక్ట్ చేయబడిన ఏదైనా Microsoft సర్వర్ లేదా నెట్‌వర్క్(ల)కు హాని కలిగించే, నిలిపివేసే, భారాన్ని పెంచే లేదా ఇబ్బందులు కలిగించే విధంగా లేదా మూడవ పక్షాల యొక్క స్టోర్ ఉపయోగంపై ప్రభావం చూపే విధంగా స్టోర్‌ని ఉపయోగించకూడదు. మీరు స్టోర్‌కు లేదా ఏదైనా Microsoft సర్వర్‌కు లేదా స్టోర్‌కు అనుసంధానించబడిన ఇతర ఖాతాలు, కంప్యూటర్ సిస్టమ్‌లు లేదా నెట్‌వర్క్‌లకు హ్యాకింగ్, పాస్‌వర్డ్ అపహరణ లేదా ఏదైనా ఇతర పద్ధతిలో అప్రామాణిక ప్రాప్తిని పొందడానికి ప్రయత్నించకూడదు. స్టోర్‌లో ఉద్దేశపూర్వకంగా అందుబాటులో ఉంచని ఏ విషయాలు లేదా సమాచారాన్ని మీరు పొందకూడదు లేదా పొందడానికి ప్రయత్నించకూడదు. Microsoft తో సహా ఎవరైనా ఇతర వ్యక్తులు లేదా సంస్థకు ఉద్దేశపూర్వకంగా హాని కలిగించడంతో పాటు మూడవ పక్షాల యొక్క హక్కులను ఉల్లంఘించే విధంగా స్టోర్‌ని ఉపయోగించకూడదు. మీరు స్టోర్ నుండి పొందే ఏ ఉత్పత్తులు, సమాచారం లేదా సేవలను వాణిజ్యపరంగా పంపిణీ చేయకూడదు, ప్రచురించకూడదు, లైసెన్స్‌ని అందించకూడదు లేదా విక్రయించకూడదు.
3. మీరు Microsoft కు అందించే లేదా స్టోర్‌లో పోస్ట్ చేసే విషయాలు. (అభిప్రాయం, రేటింగ్‌లు, సమీక్షలు మరియు సూచనలతో సహా) ఇతరుల సమీక్ష కోసం మీరు Microsoft కు అందించే లేదా స్టోర్ లేదా అనుబంధిత Microsoft సేవల్లో పోస్ట్ చేసే, అప్‌లోడ్ చేసే, నమోదు చేసే లేదా సమర్పించే (విడివిడిగా అయితే "సమర్పణ" మరియు సంయుక్తంగా అయితే "సమర్పణలు") ఏ విషయాలను Microsoft తన స్వంతంగా ప్రకటించదు. అయితే, మీరు సమర్పించిన విషయాలను ఉపయోగించడం, సవరించడం, అన్వయించుకోవడం, పునరుత్పత్తి చేయడం, సారూప్య కార్యాచరణలను సృష్టించడం, అనువదించడం, సవరించడం, అమలు చేయడం, పంపిణీ చేయడం మరియు ఏదైనా మీడియాలో మీ పేరుతో పాటు ప్రదర్శించడం కోసం Microsoft కు రాయల్టీ-రహిత, నిరంతరం కొనసాగే, ఉపసంహరించుకోలేని, ప్రపంచవ్యాప్త, సాధారణ మరియు ఉప-లైసెన్స్ అందించగల హక్కును మీరు అందించవచ్చు. మీరు సమర్పించే విషయాలను స్టోర్‌లో ఎటువంటి పరిమితులు లేకుండా విస్తృతంగా ఆన్‌లైన్‌లో అందుబాటులో ప్రాంతంలో మీరు సమర్పిస్తే, స్టోర్ మరియు/లేదా స్టోర్‌లో అందుబాటులో ఉండే ఉత్పత్తులు, సేవలు మరియు విషయాలను వివరించగల లేదా ప్రచారం చేయగల విషయాలలో మీకు సంబంధించిన విషయాలు కనిపించవచ్చు. మీరు సమర్పించే అన్ని విషయాలను Microsoft కు అందించడానికి మరియు ఈ హక్కులను మంజూరు చేయడానికి అవసరమైన అన్ని హక్కులు మీకు ఉన్నాయని (మరియు ఉంటాయని) మీరు మాకు తెలియజేయాలి.
మీరు సమర్పించిన విషయాలను ఉపయోగించినందుకుగానూ మీకు ఎటువంటి పరిహారం అందించబడదు. మీరు సమర్పించే విషయాలను పోస్ట్ చేయడం లేదా ఉపయోగించడానికి Microsoft పై ఎటుంటి నిర్బంధం ఉండదు మరియు ఏ సమయంలో అయనా Microsoft తన స్వీయ నిర్ణయానుసారం మీరు సమర్పించిన విషయాలను తీసివేయగలదు. మీరు సమర్పించే విషయాలు లేదా స్టోర్‌ని ఉపయోగించి ఇతరులు పోస్ట్ చేసే, అప్‌లోడ్ చేసే, నమోదు చేసే లేదా సమర్పించే విషయాలకు Microsoft ఏ బాధ్యత వహించదు.
మీరు స్టోర్‌లో అనువర్తనాన్ని రేట్ చేసినప్పుడు లేదా సమీక్షించినప్పుడు, అనువర్తనం యొక్క ప్రచురణకర్త యొక్క కంటెంట్‌ను కలిగి ఉన్న ఇమెయిల్ Microsoft నుండి మీకు పంపబడుతుంది.
4. మూడవ పక్ష వెబ్‌సైట్‌లకు లింక్‌లు. స్టోర్‌లో మూడవ పక్ష వెబ్‌సైట్‌లకు లింక్‌లు ఉండవచ్చు, ఇవి మిమ్మల్ని స్టోర్ నుండి బయటకు తీసుకెళ్లవచ్చు. లింక్ చేయబడిన ఈ సైట్‌లను Microsoft నియంత్రించదు మరియు లింక్ చేయబడిన సైట్‌లో ఉన్న ఏ విషయాలకు లేదా ఏ లింక్ చేయబడిన సైట్‌కు Microsoft బాధ్యత వహించదు. Microsoft కేవలం మీకు ఒక సదుపాయం వలె మాత్రమే ఈ లింక్‌లను అందిస్తోంది మరియు ఏ లింక్‌ని అందించినా కూడా ఆ సైట్‌ను Microsoft ప్రచారం చేస్తున్నట్లు భావించకూడదు. మీరు మూడవ పక్ష వెబ్‌సైట్‌ని ఉపయోగించే సమయంలో ఆ మూడవ పక్ష నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండవచ్చు.
ఉత్పత్తులుమరియుసేవలయొక్కవిక్రయానికిసంబంధించిమీకువర్తించేనిబంధనలు
5. భౌగోళిక లభ్యత. ఉత్పత్తులు మరియు సేవల లభ్యత మీ ప్రాంతం లేదా పరికరం ఆధారంగా మారవచ్చు. అదనంగా, మా రవాణా విధానాలకు అనుగుణంగా మేము రవాణా చేయగల స్థలాలు పరిమితంగా ఉండవచ్చు. మీ కొనుగోలును పూర్తి చేయాలంటే, మీరు కొనుగోలు చేస్తున్న స్టోర్ యొక్క దేశం లేదా ప్రాంతంలోనే చెల్లుబాటు అయ్యే బిల్లింగ్ మరియు రవాణా చిరునామాను మీరు పేర్కొనాలి.
6. తుది వినియోగదారులు మాత్రమే. స్టోర్ నుండి ఉత్పత్తులు మరియు సేవలను కొనుగోలు చేయాలంటే మీరు తుది వినియోగదారు అయి ఉండాలి. కొనుగోలు చేసిన వస్తువులను తిరిగి విక్రయించకూడదు.
7. ఎగుమతులపై పరిమితులు. స్టోర్ నుండి కొనుగోలు చేసిన ఉత్పత్తులు మరియు సేవలు కస్టమ్స్ మరియు ఎగుమతి నియంత్రణ చట్టాలు మరియు నియమాలకు కట్టుబడి ఉండాల్సి రావచ్చు. వర్తించే అన్ని అంతర్జాతీయ మరియు జాతీయ చట్టాలు మరియు నియమాలకు కట్టుబడి ఉండటానికి మీరు అంగీకరించాలి.
8. బిల్లింగ్. Microsoft కి చెల్లింపు పద్ధతిని అందిస్తే, మీరు: (i) మీరు అందించే చెల్లింపు పద్ధతిని ఉపయోగించడానికి మీకు అధికారం ఉన్నట్లు మరియు చెల్లింపు సమాచారం మొత్తం వాస్తవంగా మరియు ఖచ్చితంగా ఉన్నట్లు మీరు నిర్ధారించాలి; (ii) ఏవైనా ఉత్పత్తులు, సేవలు లేదా అందుబాటులో ఉన్న విషయాలకు సంబంధించి మీ చెల్లింపు సమాచారం ద్వారా ఛార్జీలు విధించడానికి Microsoft కు అధికారాన్ని అందించాలి; మరియు (iii) స్టోర్‌లో మీరు ఏదైనా చెల్లింపు ఫీచర్‌కు సైన్ ఇన్ చేసినప్పుడు లేదా దానిని ఉయోగించడానికి ఛార్జీలు విధించడానికి Microsoft కు అధికారాన్ని అందించాలి. మీ లావాదేవీలను పూర్తి చేయడం మరియు మీ లావాదేవీలకు సంబంధించి మిమ్మల్ని సంప్రదించడం కోసం మాకు మీ ఇమెయిల్ చిరునామా మరియు క్రెడిట్ కార్డ్ సంఖ్యలు మరియు గడువు ముగింపు తేదీలతో సహా మీ ఖాతా మరియు ఇతర సమాచారాన్ని అందించడానికి మరియు కాలానుగుణంగా నవీకరించడానికి మీరు అంగీకరించాలి. మేము మీకు (a) ముందస్తుగా; (b) కొనుగోలు సమయంలో; (c) కొనుగోలు చేసిన కొంత సమయం తర్వాత; లేదా (d) సభ్యత్వాలకు సంబంధించి పునరావృత వాయిదాల పద్ధతిలో మీరు బిల్ విధించవచ్చు. ఇంకా, మీరు ఆమోదించినంత మొత్తం మీకు ఛార్జీ విధిస్తాము మరియు పునరావృత వాయిదాల యొక్క మొత్తాలలో ఏవైనా మార్పులు ఉంటే మేము మీకు ముందస్తుగా తెలియజేస్తాము మరియు మీ సభ్యత్వ నిబంధనలకు అనుగుణంగా తెలియజేస్తాము. మీ మునుపటి బిల్లింగ్ వ్యవధులలో ఏవైనా పెండింగ్‌లో ఉన్నట్లయితే, మేము ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ మొత్తాలను బిల్ విధించవచ్చు. దిగువ స్వయంచాలక పునరుద్ధరణ విభాగాన్ని చూడండి.
మీరు ఏదైనా ట్రయల్-వ్యవధి ఆఫర్‌ని ఉపయోగిస్తుంటే, మేము ప్రత్యేకించి చెప్పినప్పుడు మినహా ట్రయల్ వ్యవధి ముగింపులో తప్పనిసరిగా సేవను రద్దు చేయండి లేకుంటే కొత్త ఛార్జీలు చెల్లించాల్సి రావచ్చు. ట్రయల్ వ్యవధి ముగింపులో మీరు సేవను రద్దు చేయకుంటే, ఉత్పత్తి లేదా సేవకు సంబంధించి మీ చెల్లింపు పద్ధతికి అనుగుణంగా ఛార్జీ విధించడానికి మీరు మాకు అధికారాన్ని ఇవ్వాలి.
9. పునరావృత చెల్లింపులు. మీరు సభ్యత్వాల ఆధారంగా ఏవైనా ఉత్పత్తులు, సేవలు లేదా కంటెంట్‌ని కొనుగోలు చేస్తే (ఉదా. వారంవారీ, నెలవారీ, 3 నెలలకోసారి లేదా వార్షికం (వర్తించే విధంగా)), మీరు లేదా Microsoft లేదా అలాకాకుంటే ఈ నిబంధనలకు అనుగుణంగా సభ్యత్వం రద్దు చేయబడే వరకు పునరావృత చెల్లింపులకు సంబంధించిన ఛార్జీలు విధించడానికి మరియు Microsoft కు చెల్లించడానికి అంగీకరిస్తున్నారు. పునరావృత చెల్లింపులకు అంగీకరించడం ద్వారా, ఎలక్ట్రానిక్ డెబిట్‌లు లేదా నిధుల బదిలీలు లేదా మీకు కేటాయించబడిన ఖాతా నుండి ఎలక్ట్రానిక్ డ్రాఫ్ట్‌లు (స్వయంచాలక నిధుల సేకరణ శాఖ లేదా సారూప్య చెల్లింపుల కోసం) లేదా మీకు కేటాయించబడిన ఖాతాకు ఛార్జీ విధించడం (క్రెడిట్ కార్డ్ లేదా సారూప్య చెల్లింపుల కోసం) (సంయుక్తంగా, "ఎలక్ట్రానిక్ చెల్లింపులు") వంటి మార్గాల ద్వారా ఆ మొత్తాలను స్వీకరించడం కోసం మీరు Microsoft ని అనుమతిస్తున్నారు. సాధారణంగా వర్తించే సభ్యత్వ వ్యవధి కంటే ముందుగానే సభ్యత్వ రుసుముల బిల్ విధించబడుతుంది లేదా ఛార్జీ విధించబడుతుంది. ఏదైనా మొత్తాన్ని చెల్లించకుంటే లేదా ఏదైనా క్రెడిట్ కార్డ్ లేదా సారూప్య లావాదేవీ తిరస్కరించబడితే లేదా నిరాకరించబడితే, వర్తించే చట్టం ప్రకారం వర్తించే తిరిగి చెల్లింపును సేకరించడానికి, తిరస్కరించబడిన లేదా ఇతర రుసుములను తీసుకోగల Microsoft లేదా దాని సేవా ప్రదాతలకు ఉంది.
10. ఉత్పత్తి లభ్యత మరియు నాణ్యత మరియు ఆర్డర్ పరిమితులు. ఉత్పత్తుల ధరలు మరియు లభ్యత అనేవి ఏ సమయంలో అయినా, ముందస్తు గమనిక లేకుండా మారవచ్చు. ఒక్కో ఆర్డర్, ఒక్కో ఖాతా, ఒక్కో క్రెడిట్ కార్డ్, ఒక్కో వ్యక్తి లేదా కుటుంబ అవసరాల కోసం మీరు కొనుగోలు చేయగల పరిమాణాలపై Microsoft పరిమితిని విధించవచ్చు. మీరు ఆర్డర్ చేసిన ఉత్పత్తులు లేదా సేవలు కనుక అందుబాటులో లేకుంటే, మేము మిమ్మల్ని సంప్రదించి ప్రత్యామ్నాయ ఉత్పత్తి గురించి వివరించవచ్చు. మీరు ప్రత్యామ్నాయ ఉత్పత్తిని కొనుగోలు చేయదలచుకోకుంటే, మేము మీ ఆర్డర్‌ని రద్దు చేస్తాము.
ఆర్డర్ చేసే సమయంలో పేర్కొన్న షరతులకు మీరు కట్టుబడి ఉండకపోవడం, మీ చెల్లింపును ప్రాసెస్ చేయలేకపోవడం, ఆర్డర్ చేసిన ఉత్పత్తులు లేదా సేవలు అందుబాటులో లేకపోవడం లేదా ధరలు లేదా ఇతర విషయాలలో దోషాలు ఏర్పడటం వంటి వాటితో సహా ఇతర కారణాల దృష్ట్యా మీరు ఆర్డర్ చేసిన వాటిని ఏ సమయంలో అయినా Microsoft తిరస్కరించగలదు లేదా నిరాకరించగలదు, ఆ ఆర్డర్ కోసం మీరు చెల్లించిన మొత్తం తిరిగి మీకు అందించబడుతుంది. ధరలు లేదా ఇతర సమస్యలు ఏర్పడినప్పుడు, (a) మీ ఆర్డర్ లేదా కొనుగోలును రద్దు చేయగల లేదా (b) సూచనల కోసం మిమ్మల్ని సంప్రదించగల హక్కు మీకు ఉంది. రద్దు చేస్తినట్లయితే, సంబంధిత కంటెంట్‌కు మీ ప్రాప్తి నిలిపివేయబడుతుంది.
మేము ఏ కారణం చేత అయినా మీ ఖాతాకు అనుబంధించబడిన కంటెంట్‌కు ప్రాప్తిని నిలిపివేయవచ్చు. స్టోర్ లేదా సంభావ్యంగా ప్రభావితం కాగల పక్షాలను రక్షించడం కోసం మేము మీ పరికరంలోని గేమ్‌లు, అనువర్తనాలు, కంటెంట్ లేదా సేవలను తీసివేయవచ్చు లేదా నిలిపివేయవచ్చు. కాలానుగుణంగా కొంత కంటెంట్ మరియు కొన్ని అప్లికేషన్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు లేదా పరిమితి సమయం పాటు అందుబాటులో ఉండవచ్చు. ప్రాంతాల ఆధారంగా లభ్యత మారవచ్చు. అయితే, మీరు మీ ఖాతా లేదా పరికరంలో ప్రాంతాన్ని మార్చినట్లయితే, మీరు కొనుగోలు చేసిన కంటెంట్ లేదా అనువర్తనాలు తిరిగి డౌన్‌లోడ్ చేయలేరు లేదా తిరిగి ప్రసారం చేయలేరు; మీరు మీ మునుపటి ప్రాంతంలో కొనుగోలు చేసిన కంటెంట్ లేదా అనువర్తనాన్ని తిరిగి కొనుగోలు చేయాల్సి ఉండవచ్చు. చట్టం ద్వారా అనుమతించబడిన పరిధి మేరకు, మీరు కొనుగోలు చేసిన ఏ కంటెంట్ లేదా అప్లికేషన్‌ని తిరిగి డౌన్‌లోడ్‌కు అందుబాటులో ఉంచాల్సిన లేదా భర్తీ చేయాల్సిన బాధ్యత మాకు లేదు.
11. అప్‌డేట్‌లు. వర్తించినట్లయితే, మీరు స్టోర్‌కు సైన్ ఇన్ చేయకపోయినా కూడా Microsoft స్వయంచాలకంగా మీ అనువర్తనాలకు నవీకరణల కోసం తనిఖీ చేస్తుంది. మీరు స్టోర్ అనువర్తనాల యొక్క నవీకరణలను స్వయంచాలకంగా స్వీకరించకూడదని నిర్ణయించుకుంటే మీ సెట్టింగ్‌లను మార్చవచ్చు. అయితే, సంపూర్ణంగా లేదా పాక్షికంగా ఆన్‌లైన్‌లో హోస్ట్ చేయబడిన నిర్దిష్ట Office స్టోర్ అనువర్తనాలు ఏ సమయంలో అయినా అనువర్తన డెవలపర్ ద్వారా నవీకరించబడవచ్చు మరియు వాటిని నవీకరించడానికి మీ అనుమతి అవసరం లేకపోవచ్చు.
12. సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లు మరియు వినియోగ హక్కులు. స్టోర్ ద్వారా మీకు లభించే సాఫ్ట్‌వేర్ మరియు ఇతర కంటెంట్‌కు లైసెన్స్ మాత్రమే అందించబడుతుంది, అవి విక్రయించబడవు. అనువర్తనంలో విభిన్నమైన నిబంధనలు పేర్కొనబడినప్పుడు మినహా, స్టోర్ నుండి నేరుగా డౌన్‌లోడ్ చేసుకున్న అనువర్తనాలు [https://go.microsoft.com/fwlink/p/?linkid=838610&clcid=0x044a]లో ప్రామాణిక అనువర్తన లైసెన్స్ నిబంధనలు ("SALT")కు కట్టుబడి ఉండాలి. (Office స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసిన అనుర్తనాలు SALT ద్వారా పర్యవేక్షించబడవు మరియు వాటిని ప్రత్యేక లైసెన్స్ నిబంధనలు ఉంటాయి) స్టోర్ ద్వారా అందించబడే అప్లికేషన్‌లు, గేమ్‌లు మరియ ఇతర డిజిటల్ కంటంట్ https://go.microsoft.com/fwlink/p/?LinkId=723143 లో వినియోగ నియమాలకు కట్టుబడి ఉండాలి. అన్ని సందర్భాలలో, డిజిటల్ వస్తువులకు సంబంధించిన మీ హక్కులు ఈ నిబంధనలు, కాపీరైట్ చట్టం మరియు ఎగువ సూచించబడిన వినియోగ నియమాల ద్వారా నియంత్రించబడతాయని మీరు అర్థం చేసుకుని, అంగీకరించాలి. Microsoft రీటైల్ స్టోర్ ద్వారా సాఫ్ట్‌వేర్ లైసెన్స్‌లను కొనగులో చేస్తే, సాఫ్ట్‌వేర్‌తో పాటు అందించబడిన లైసెన్స్ ఒప్పందానికి అవి కట్టుబడి ఉంటాయి మరియు సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేసిన సమయంలో మీరు కూడా లైసెన్స్ ఒప్పందానికి కట్టుబడి ఉండాలి. లైసెన్స్ నిబంధనలు, వినియోగ నియమాలు మరియు వర్తించే చట్టంలో ప్రత్యేకంగా పేర్కొనని విధంగా సాఫ్ట్‌వేర్‌ని ఏ రకమైన పునరుత్పత్తి లేదా పునఃపంపిణీ చేయడం లేదా దానిని వర్తకం చేయడం వంటివి నిషేధించబడ్డాయి మరియు తీవ్రమైన పౌర మరియు నేర జరిమానాలు విధించబడవచ్చు. ఉల్లంఘనలు చేసిన వ్యక్తులను చట్ట ప్రకారం గరిష్ట స్థాయిలో విచారించవచ్చు.
దయచేసి ఏదైనా సాఫ్ట్‌వేర్ ప్యాకేజీని తెరవడం కంటే ముందు డబ్బాలోనే ఉన్న సాఫ్ట్‌వేర్ యొక్క వర్తించే లైసెన్స్ ఒప్పందానికి మీరు ఏదైనా కాపీని పొందాలనుకుంటే, MICROSOFT రీటైల్ స్టోర్‌ని (దిగువ గమనికలు మరియు కమ్యూనికేషన్‌ల విభాగంలో పేర్కొన్న విధంగా) సంప్రదించాలి.
ఇతర నిబంధనలు మరియు షరతులు. సాఫ్ట్‌వేర్ మరియు ఇతర డౌన్‌లోడ్ చేసుకోగల ఉత్పత్తులతో పాటు, కొనుగోలు చేయడం లేదా ట్రయల్ పొందడం కోసం స్టోర్‌లో అందుబాటులో ఉండే ఉత్పత్తులు మరియు సేవలను మీకు అందించే సమయంలో మీరు ప్రత్యేక తుది వినియోగదారు లైసెన్స్ ఒప్పందాలు, వినియోగ నిబంధనలు, సేవా నిబంధనలు మరియు ఇతర నిబంధనలు మరియు షరతులకు కట్టుబడి ఉండాలి. మీరు అటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు లేదా ఉపయోగించినప్పుడు, మీరు కొనుగోలు, ఇన్‌స్టాలేషన్ లేదా ఉపయోగానికి సంబంధించిన వాటిని నిబంధనలకు కూడా కట్టుబడి ఉండాల్సి రావచ్చు.
మీ సౌకర్యం కోసం, స్టోర్ లేదా సేవలలో భాగంగా MICROSOFT తన సాఫ్ట్‌వేర్ లేదా వర్తకంలో భాగంగా, సాధనాలు మరియు ఉపకరణాలను విక్రయించబడే ఉత్పత్తులు లేదా సేవలను ఉపయోగానికి మరియు/లేదా డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచవచ్చు. వర్తించే చట్టం ద్వారా అనుమతించబడే గరిష్ట పరిధి మేరకు, అటువంటి ఏవైనా సాధనాలు లేదా ఉపకరణాల యొక్క ఫలితాలు లేదా తదనంతర అవుట్‌పుట్‌ల యొక్క ఖచ్చితత్వానికి సంబంధించి MICROSOFT ఏ ప్రాతినిధ్యం వహించదు, వారంటీలు లేదా హామీలను అందించదు.
దయచేసి స్టోర్‌లో లేదా సాఫ్ట్‌వేర్‌లో లేదా వర్తకంలో అందుబాటులో ఉన్న సాధనాలు మరియు ఉపకరణాలను ఉపయోగించే సమయంలో ఇతరుల మేధోపరమైన ఆస్తి హక్కులను గౌరవించండి.
13. సాఫ్ట్‌వేర్ మరియు కంటెంట్ డౌన్‌లోడ్‌ల కోసం కోడ్‌లు. నిర్దిష్ట సాఫ్ట్‌వేర్ మరియు కంటెంట్ కోసం మీ కొనుగోలుకు అనుబంధితంగా ఉన్న మీ Microsoft ఖాతాలో డౌన్‌లోడ్ చేసుకోగల లింక్‌ని అందించవచ్చు. దిగువ పేరాకు అనుగుణంగా, సాధారణంగా ఈ ఉత్పత్తులను డౌన్‌లోడ్ చేసుకోగల లింక్ మరియు సంబంధిత డిజిటల్ కీని మేము మీ Microsoft ఖాతాలో 3 సంవత్సరాల పాటు ఉంచుతాము, కానీ నిర్దిష్ట సమయ వ్యవధి పాటు వాటిని కాపాడతామని ఎటువంటి హామీని అందించము. డౌన్‌లోడ్ చేసుకోగల లింక్ ద్వారా అందించబడే సభ్యత్వంతో కూడిన ఉత్పత్తులకు విభిన్నమైన నిబంధనలు మరియు నిల్వ హక్కులు వర్తించవచ్చు, మీరు సభ్యత్వం పొందే సమయంలో వీటిని సమీక్షించవచ్చు మరియు వీటికి అంగీకరించవచ్చు.
మేము ఏ సమయంలో అయినా మా డిజిటల్ కీ నిల్వను రద్దు చేయడానికి లేదా సవరించడానికి మీరు అంగీకరించాలి. ఉత్పత్తి మద్దతు జీవిత కాలం ముగియడంతో పాటు ఇతర కారణాల వల్ల ఏ సమయంలో అయినా ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఉత్పత్తుల యొక్క కీల నిల్వకు మద్దతును మేము ఉపసంహరించుకోవచ్చని, ఆపై డౌన్‌లోడ్ చేసుకోగల లింక్ లేదా డిజిటల్ కీని మీరు ప్రాప్తి చేయలేరని మీరు అర్థం చేసుకుని, అంగీకరించాలి. డౌన్‌లోడ్ చేసుకోగల లింక్ లేదా డిజిటల్ కీ(ల)ను మేము రద్దు చేయడం లేదా సవరించడం కారణంగా మీరు వాటికి ప్రాప్తి కోల్పోయే సందర్భంలో, సంబంధిత Microsoft ఖాతాలో ఉన్న సంప్రదింపు సమాచారాన్ని ఉపయోగించి మీకు కనీసం 90 రోజుల ముందు తెలియజేస్తాము.
14. ధరలు. మీ దేశం లేదా ప్రాంతంలో మాకు Microsoft రీటైల్ స్టోర్ ఉంటే, అందులో అందించబడే ధరలు, ఉత్పత్తి ఎంపిక మరియు ప్రచారాలు ఆన్‌లైన్ స్టోర్‌లో ఉన్న విధంగా ఉండకపోవచ్చు. వర్తించే చట్టం ద్వారా అనుమతించబడే గరిష్ట పరిధి మేరకు, ఆన్‌లైన్ స్టోర్‌లోనూ మరియు Microsoft రీటైల్ స్టోర్‌లోనూ ఒకే విధమైన ధర, ఉత్పత్తి లేదా ప్రచారం అందించబడతాయని Microsoft ఎటువంటి హామీ ఇవ్వదు.
స్టోర్‌లో ధర సరిపోలికలకు ఎటువంటి గ్యారంటీ ఉండదు. ప్రకటనలో చూపబడిన ధరను అదే వస్తువులకు ఇతరులు పేర్కొన్న ధరలతో మేము సరిపోల్చము.
మీరు కొన్ని ఉత్పత్తులను వాటి లభ్యత తేదీ కంటే ముందుగా ఆర్డర్ చేయవచ్చు. మా ముందస్తు ఆర్డర్ విధానాల గురించి మరింత తెలుసుకోవాలంటే, దయచేసి మా ముందస్తు ఆర్డర్‌ల పేజీని https://go.microsoft.com/fwlink/p/?linkid=834935&clcid=0x044a సందర్శించండి.
ప్రత్యేకంగా పేర్కొన్నప్పుడు మినహా, మీ కొనుగోలుకు వర్తించే పన్నలు లేదా ఛార్జీలు ("పన్నులు") స్టోర్‌లో చూపబడే ధరల్లో ఉండకపోవచ్చు. స్టోర్‌లో చూపబడే ధరల్లో ఎల్లప్పుడూ బట్వాడా ధరలు కలిపి చూపబడవు. (సముచిత పద్ధతిలో) పన్నులు మరియు బట్వాడా ధరలు మీ కొనుగోలు మొత్తానికి జోడించబడతాయి మరియు చెక్-అవుట్ పేజీలో చూపబడతాయి. అటువంటి పన్నులు మరియు ధరలకు పూర్తిగా మీరే బాధ్యత వహించాలి.
మీ స్థానం ఆధారంగా, కొన్ని లావాదేవీల కోసం విదేశీ నగదు మార్పిడి అవసరం కావచ్చు లేదా మరొక దేశంలో ప్రాసెస్ చేయబడవచ్చు. అటువంటి సేవల కోసం మీరు డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించినప్పుడు మీ బ్యాంక్‌కు మీరు అదనపు ఛార్జీలు చెల్లించాల్సి ఉండవచ్చు. దయచేసి వివరాల కోసం మీ బ్యాంక్‌ని సంప్రదించండి.
15. స్వీయ పునరుద్ధరణ ఎంపిక. మీ దేశం, ప్రాంతం, రాజ్యం/భూభాగం లేదా రాష్ట్రంలో స్వయంచాలక పునరుద్ధరణలు అందుబాటులో ఉన్నట్లయితే, నిర్దిష్ట సేవ కాల వ్యవధి ముగిసిన వెంటనే స్వయంచాలకంగా పునరుద్ధరించే విధంగా మీరు ఎంచుకోవచ్చు. సేవను స్వయంచాలకంగా పునరుద్ధరించడానికి మీరు ఎంచుకున్నట్లయితే, మేము మీకు తెలియజేసిన తర్వాత, దిగువ వివరించబడిన విధంగా మీరు సేవలను రద్దు చేస్తే తప్ప, ప్రస్తుత సేవ కాల వ్యవధి ముగిసిన తర్వాత మేము మీ సేవలను స్వయంచాలకంగా పునరుద్ధరిస్తాము మరియు పునరుద్ధరించబడిన వ్యవధికి సంబంధించిన ప్రస్తుత ధరను స్వయంచాలకంగా మీకు ఛార్జీ విధిస్తాము. పునరుద్ధరణ తేదీన లేదా ఆ తర్వాత చెల్లించాల్సిన పక్షంలో, మీరు ఎంచుకున్న చెల్లింపు పద్ధతి ప్రకారం ఆ మొత్తాన్ని మేము భిల్ విధిస్తాము. పునరుద్ధరణ తేదీ కంటే ముందు మీరు ఉత్పత్తులు లేదా సేవలను రద్దు చేయవచ్చు. మీరు పునరుద్ధరణ కోసం బిల్ చేయబడటాన్ని తిరస్కరించాలంటే, పునరుద్ధరణ తేదీ కంటే ముందు సేవలను తప్పక రద్దు చేయాలి.
16. వాపసు విధానం. వర్తించే విధంగా, అర్హత ఉన్న ఉత్పత్తులను కొనుగోలు చేసిన లేదా డౌన్‌లోడ్ చేసిన తేదీ నుండి 14 రోజులలోపు వాపసు ఇవ్వడానికి మరియు మార్చడానికి మేము అంగీకరిస్తాము. అర్హత ఉన్న ఉత్పత్తులను, వాటి అన్ని భాగాలు, అంతర్భాగాలు, సూచన మార్గదర్శకాలు మరియు పత్రాలతో సహా మీరు ఏ విధంగా స్వీకరించారో అదే విధంగా తిరిగి వాస్తవ ప్యాకేజీతో పాటు అందించాలి. వర్తించే ఎటువంటి చట్టబద్ధమైన హక్కులను ఈ తిరిగి చెల్లింపు విధానం ప్రభావితం చేయదు.
ప్యాకేజీ రూపంలో అందించబడిన సాఫ్ట్‌వేర్ మరియు గేమ్‌లు వాటి వాస్తవ ముద్రతో పాటు తప్పనిసరిగా అన్ని మీడియా మరియు ఉత్పత్తి కీలతో సహా అందించాలి. పరిమితమైన మినహాయింపు వలె, మీరు ఏవైనా సాఫ్ట్‌వేర్ మరియు గేమ్ ప్యాకేజీలను తెరిచినా కూడా, లైసెన్స్ ఒప్పందానికి అంగీకరించకుంటే వాపసు కాల వ్యవధిలోపు వాటిని తిరిగి ఇచ్చేయవచ్చు, కానీ ఏ కాపీలను రూపొందించకూడదు లేదా ఉపయోగించకూడదు.
కొన్ని అంశాలను తిరిగి అందించడం సాధ్యం కాదు; ప్రత్యేకంగా చట్టం ద్వారా అనుమతించబడినప్పుడు లేదా ప్రత్యేక ఉత్పత్తి ఆఫర్‌ని అందించిన సమయంలో మినహా సాధారణంగా ఇలాంటి రకాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తే, అవి అంతిమం మరియు తిరిగి చెల్లింపును స్వీకరించడం సాధ్యం కాదు అని పరిగణించబడతాయి:
డిజిటల్ అనువర్తనాలు, గేమ్‌లు అనువర్తనంలో కంటెంట్ మరియు సభ్యత్వాలు, సంగీతం, చలనచిత్రాలు, TV కార్యక్రమాలు మరియు అనుబంధిత కంటెంట్;
బహుమతి కార్డ్‌లు మరియు సేవ/సభ్యత్వ కార్డ్‌లు (ఉదా., Skype, Xbox, Groove Music Pass);
వ్యక్తిగతీకరించబడిన లేదా అనుకూలీకరించబడిన ఉత్పత్తులు;
స్టోర్ ప్రచారం ద్వారా అందించని ఉత్పత్తులను ప్రత్యేకంగా ఆర్డర్ చేయవచ్చు;
యాదృచ్ఛిక ప్రాప్తి మెమరీ ("RAM") ఉత్పత్తులు;
అమలు చేయబడిన లేదా వినియోగించబడిన సేవలు; మరియు
క్లియరెన్స్‌లో విక్రయించబడే అంశాలు లేదా "ఆఖరి విక్రయం" లేదా "వాపసు ఇవ్వలేరు" అని పేర్కొనబడినవి.
మీరు ఏదైనా అర్హత ఉన్న వాపసును అందించే సమయాన, వాస్తవ రవాణాలు ఛార్జీలు మరియు బట్వాడా ఛార్జీలు (ఏవైనా ఉంటే) మినహాయించి మిగిలిన మొత్తం డబ్బును తిరిగి చెల్లిస్తాము, సాధారణంగా 3-5 పనిదినాలలో మీకు ఈ తిరిగి చెల్లింపు అందించబడుతుంది. (మీరు తిరిగి చెల్లింపు కోసం స్టోర్ క్రెడిట్‌ని ఉపయోగించిన సమయంలో మినహా) సాధారణంగా ఆర్డర్ చేసే సమయంలో మీరు ఉపయోగించిన ఖాతా మరియు చెల్లింపు పద్ధతిలోనే తిరిగి చెల్లింపులు అందించబడతాయి.
వాపసు ఇవ్వడానికి అర్హత ఉన్న అత్పత్తుల గురించి పూర్తి వివరాల కోసం, మా వాపసు మరియు తిరిగి చెల్లింపులు పేజీని https://go.microsoft.com/fwlink/p/?linkid=723276&clcid=0x044a చూడండి.
మీరు తైవాన్‌లో నివసిస్తున్నట్లయితే, దయచేసి తైవాన్ వినియోగదారుల రక్షణ చట్టం మరియు దాని సంబంధిత నియంత్రణల ప్రకారం, ఏదైనా కంటెంట్ లేదా సేవను ఆన్‌లైన్ ద్వారా పొందినప్పుడు ఇంద్రియ గ్రాహ్యం కాని రూపంలో మరియు/లేదా ఆన్-లైన్ ద్వారా పొందిన డిజిటల్ కంటెంట్‌కు సంబంధించిన అన్ని కొనుగోళ్లు కూడా అంతిమంగా మరియు తిరిగి-చెల్లింపు అందించనివిగా పరిగణించడతాయి. మీకు ఏ ఉపసంహరణ కాల వ్యవధి లేదా ఏ తిరిగి చెల్లింపు అందించబడదు.
17. మీకుచెల్లింపులు. మేము మీకు ఏదైనా డబ్బు చెల్లించాల్సి వస్తే, మీకు ఆ మొత్తాన్ని చెల్లించడం కోసం మాకు సమాచారం మొత్తాన్ని కాలానుగుణంగా మరియు ఖచ్చితంగా అందించడానికి మీరు అంగీకరించాలి. ఇటువంటి చెల్లింపును స్వీకరించిన కారణంగా ఏవైనా పన్నులు మరియు ఇతర రుసుములు చెల్లించాల్సి వస్తే అందుకు మీరే పూర్తి బాధ్యత వహించాలి. చట్టం ద్వారా అనుమతించబడిన పరిధి మేరకు, ఏదైనా చెల్లింపును మీరు స్వీకరించగల హక్కులపై మేము విధించే ఇతర షరతులకు కూడా మీరు కట్టుబడి ఉండాలి. మీకు ఏదైనా చెల్లింపు పొరపాటుగా అందితే, మేము దానిని తిరిగి తీసుకోవచ్చు లేదా మీరు దానిని తిరిగి చెల్లించాల్సి రావచ్చు. ఈ ప్రక్రియలో మీరు మాకు సహాయం చేయాలి. మీరు ఏదైనా బాకీ ఉన్నట్లయితే, ఆ మొత్తాన్ని మీకు చెల్లించే డబ్బు నుండి తీసుకోవవచ్చు.
18. బహుమతి కార్డ్‌లు. Microsoft రీటైల్ స్టోర్ ద్వారా కొనుగోలు చేసిన బహుమతి కార్డ్‌లు https://www.microsoftstore.com/store/msusa/html/pbPage.Help_Retail_Stores#GiftCards లో ఉన్న రీటైల్ బహుమతి కార్డ్ ఒప్పందం ద్వారా పర్యవేక్షించబడతాయి.
Skype బహుమతి కార్డ్‌లకు సంబంధించిన సమాచారం Skype యొక్క సహాయం పేజీ (https://support.skype.com/en/faq/FA12197/what-is-a-skype-gift-card-and-where-can-i-buy-one)లో ఉంటుంది.
ఇతర Microsoft బహుమతి కార్డ్‌లను రీడీమ్ చేయడం మరియు ఉపయోగించడం వంటివి (https://commerce.microsoft.com/PaymentHub/Help/Show/toc_link_no_62) లో ఉన్న Microsoft బహుమతి కార్డ్ నిబంధనలు మరియు షరతుల ద్వారా పర్యవేక్షించబడతాయి.
19. కస్టమర్ సేవ. దయచేసి కస్టమర్ సేవా ఎంపికల గురించి మరింత సమాచారం కావాలంటే, మా విక్రయాలు మరియు మద్దతు పేజీని https://go.microsoft.com/fwlink/p/?linkid=824761&clcid=0x044a సందర్శించండి.
సాధారణనిబంధనలు
20. నిబంధనలను మార్చడం. Microsoft ఏ సమయంలో అయినా ముందస్తు ప్రకటన లేకుండానే విక్రయాల నిబంధనలను మార్చవచ్చు. మీరు కొనుగోలు చేసే సమయంలో చెల్లుబాటులో ఉన్న విక్రయాల నిబంధనల ద్వారా మీ ఆర్డర్ పర్యవేక్షించబడుతుంది మరియు మన మధ్య ఒక ఒప్పందం వలె పరిగణించబడతాయి. మీ తదుపరి కొనుగోలు కంటే ముందు, మీకు ముందుగా తెలియజేయకుండానే విక్రయాల నిబంధనలను Microsoft మార్చగలదు. దయచేసి స్టోర్‌ని సందర్శించిన ప్రతిసారీ విక్రయాల నిబంధనలను సమీక్షించండి. మీరు ఏదైనా కొనుగోలు చేసే సమయంలో భవిష్యత్తు అవసరాల కోసం విక్రయాల నిబంధనల యొక్క ఒక కాపీని సేవ్ చేసి లేదా ముద్రించుకుని ఉంచాలని మేము సిఫార్సు చేస్తున్నాము.
21. వయస్సు పరిమితులు. కొనుగోళ్లతో స్టోర్ యొక్క మీ ఉపయోగానికి వయస్సు పరిమితులు వర్తించవచ్చు.
22. వ్యక్తిగత సమాచారం యొక్క గోప్యత మరియు రక్షణ. మాకు మీ గోప్యత ముఖ్యం. స్టోర్‌ను నిర్వహించడం మరియు అందించడం కోసం మేము సేకరించిన సమాచారంలో నిర్దిష్ట భాగాన్ని ఉపయోగించవచ్చు. దయచేసి Microsoft గోప్యతా ప్రకటనను చదవండి, మేము మీ నుండి మరియు మీ పరికరాల నుండి ఏ రకాల డేటాను ("డేటా") సేకరిస్తాము మరియు దానిని మేము ఎలా ఉపయోగిస్తాము అన్నవి ఇందులో వివరించబడింది. Microsoft మీ కమ్యూనికేషన్‌లను ఇతరులతో ఎలా ఉపయోగిస్తుంది; స్టోర్ ద్వారా మీరు పోస్ట్ చేసిన లేదా Microsoftకు సమర్పించిన అభిప్రాయం; మరియు మీ పరికరాలలో నిల్వ చేసిన లేదా భాగస్వామ్యం చేసిన లేదా స్టోర్ ద్వారా భాగస్వామ్యం చేసిన ఫైల్‌లు, ఫోటోలు, పత్రాలు, ఆడియో, డిజిటల్ కార్యాచరణలు మరియు వీడియోలు ("మీ కంటెంట్") ఎలా ఉపయోగించబడతాయి అన్నవి గోప్యతా ప్రకటనలో చూడవచ్చు. సేవలను ఉపయోగించడం లేదా ఈ నిబంధనలకు అంగీకరించడం ద్వారా, గోప్యతా ప్రకటనలో పేర్కొన్న విధంగా మీ కంటెంట్ మరియు డేటాని Microsoft సేకరించడానికి, ఉపయోగించడానికి మరియు బహిర్గతం చేయడానికి మీరు అంగీకరిస్తున్నారు.
23. ఉత్పత్తి ప్రదర్శన మరియ రంగులు. ఉత్పత్తి రంగులు మరియు చిత్రాలను Microsoft ఖచ్చితంగా ప్రదర్శించడం కోసం ప్రయత్నిస్తుంది, కానీ ఉత్పత్తి యొక్క రంగు మరియు మీరు మీ పరికర స్క్రీన్ లేదా మానిటర్‌లో చూసే రంగులు వేరుగా ఉండవచ్చు.
24. స్టోర్ ప్రదర్శనలో దోషాలు. ఖచ్చితమైన సమాచారాన్ని ప్రచురించడం, తరచుగా స్టోర్‌ని నవీకరించడం మరియు దోషాలను సకాలంలో సరి చేయడం కోసం మేము తీవ్రంగా శ్రమిస్తుంటాము. అయితే, స్టోర్‌లోని ఏదైనా సమాచారం తప్పుగా ఉండవచ్చు లేదా తాజాగా లేకపోవచ్చు. ఉత్పత్తుల ధరలు, స్పెసిఫికేషన్‌లు, తగ్గింపులు మరియు లభ్యతతో సహా ఏ సమయంలో అయినా స్టోర్‌లో మార్పులు చేయగల హక్కు మాకు ఉంది.
25. ఉపయోగం లేదా ప్రాప్తిని శాశ్వతంగా రద్దు చేయడం. మీరు ఈ విక్రయాల నిబంధనలు లేదా స్టోర్ విధానాలను ఉల్లంఘించడం లేదా స్టోర్‌ని Microsoft నిర్వహించలేకపోవడంతో పాటు ఇతర ఏవైనా కారణాల వల్ల ఏ సమయంలో అయినా మీ ఖాతా లేదా స్టోర్ యొక్క ఉపయోగాన్ని Microsoft నిలిపివేయగలదు. స్టోర్‌ని ఉపయోగించడం ద్వారా, శాశ్వతంగా రద్దు చేయడం కంటే ముందు మీరు చేసే ఆర్డర్‌లు లేదా చెల్లించాల్సిన ఛార్జీలకు (ఈ నిబంధనలకు అనుగుణంగా) మీరు బాధ్యత వహించాలి. Microsoft మీకు ముందుగా తెలియకుండానే ఏ కారణం వల్ల అయినా ఏ సమయంలో అయినా స్టోర్‌ని మార్చవచ్చు, ఆపివేయవచ్చు లేదా తాత్కాలికంగా నిలిపివేయవచ్చు.
26. వారంటీలు మరియు పరిహారాలకు పరిమితులు. మీ స్థానిక చట్టం ద్వారా అనుమతించబడిన పరిధి మేరకు, వర్తక యోగ్యత, సంతృప్తికర నాణ్యత, నిర్దిష్ట అవసరాలకు తగ్గట్లు ఉండటం, మనుషుల వలె పని చేయడం లేదా ఉల్లంఘనల రహితంగా ఉండటం వంటి వాటితో సహా MICROSOFT మరియు దాని సరఫరాదారులు, పంపిణీదారులు, విక్రేతలు మరియు కంటెంట్ ప్రదాతలు ఎటువంటి ఇతర హామీలు అందించరు. స్టోర్‌లో విక్రయించే లేదా అందుబాటులో ఉంచే ఉత్పత్తులు లేదా సేవలకు ఏవైనా లెసెన్స్ ఒప్పందాలు లేదా తయారీదారు యొక్క వారంటీలు ఉన్నట్లయితే అవి వర్తిస్తాయి. సంబంధిత లెసెన్స్ ఒప్పందాలు లేదా తయారీదారు యొక్క వారంటీలు మరియు మీ శాసనబద్ధ హక్కుల ద్వారా పేర్కొనబడినప్పుడు మినహా:
మీరు స్వీయ నిర్ణయానుసారం ఉత్పత్తులను కొనుగోలు చేయాలి మరియు ఉపయోగించాలి;
మేము ఉత్పత్తులు మరియు సేవలను "యథావిధిగా," "అన్ని లోపాలతో" మరియు "అందుబాటులో ఉన్న విధంగా" అందించబడతాయి;
వాటి నాణ్యత మరియు పనితీరులో ఏర్పడగల సమస్యలను మీరు అంచనా వేసుకోవాలి; మరియు
అవసరమైన అన్ని నిర్వహణలు లేదా మరమ్మతులకు సంబంధించిన ఖర్చులను మీరు అంచనా వేసుకోవాలి.
స్టోర్ లేదా సేవల నుండి అందుబాటులో ఉండే సమాచారం యొక్క ఖచ్చితత్వం లేదా కాలానుగుణతకు సంబంధించి MICROSOFT ఎటువంటి హామీలు ఇవ్వదు. కంప్యూటర్మరియుటెలీకమ్యూనికేషన్‌లలోదోషాలుఉండవచ్చనిమరియుకాలానుగుణంగాఅంతరాయాలుఏర్పడవచ్చనిమీరుఅర్థంచేసుకుని, అంగీకరించాలి. స్టోర్లేదాసేవలకుప్రాప్తినిర్విరామంగా, కాలానుగుణంగాలేదాదోష-రహితంగాఉంటుందనిలేదాఎప్పటికీకంటెంట్‌నికోల్పోరనిమేముమీకుహామీలనుఇవ్వము.
స్టోర్, సేవలులేదాఏదైనాఉత్పత్తిలేదాసేవకారణంగాఏర్పడిననష్టాలకుఈవిక్రయాలనిబంధనలుకాకుండా, మరేఇతరమార్గాలలలోఅయినాసరేపరిహారంపొందడానికిమీకుహక్కుఉంటే, వర్తించేచట్టంప్రకారంఅనుమతించబడినగరిష్టపరిధిమేరకు Microsoft లేదాదానిసరఫరాదారులు, పునఃవిక్రేతలు, పంపిణీదారులుమరియుకంటెంట్ప్రదాతలుమీనష్టాలకుసంబంధించినపరిహారంఅందించవచ్చు, గరిష్టమొత్తం (1) (హార్డ్‌వేర్, సాఫ్ట్‌వేర్, మద్దతులేదావారంటీలపొడిగింపులనుకొనుగోలుచేయడంకోసంచేసినఖర్చులుకాకుండా) ఏదైనాసేవ, సభ్యత్వంకోసంలేదాసారూప్యరుసముములుఒకనెలలోచెల్లించినమొత్తంలేదా (2) సేవ, సభ్యత్వంలేదాసారూప్యరుముసులేకుంటే US $100.00.
మీ స్థానిక చట్టం ప్రకారం మీకు నిర్దిష్ట హక్కులు ఉండవచ్చు. వర్తించినట్లయితే, ఈ కాంట్రాక్ట్ కారణంగా ఆ హక్కులపై ఎటువంటి ప్రభావం ఉండదు.
న్యూజిలాండ్‌లోనివసిస్తున్నకస్టమర్‌లకున్యూజిలాండ్కస్టమర్హక్కులచట్టంప్రకారంప్రత్యేకశాసనబద్ధహక్కులుఉండవచ్చుమరియుఈవిక్రయాలనిబంధనలయొక్కప్రభావంవాటిపైఉండదు.
27. బాధ్యతలకు పరిమితి. వర్తించే చట్టం ద్వారా అనుమతించబడే గరిష్ట పరిధి మేరకు, పరిణామపూర్వక, ప్రత్యేక, పరోక్ష, సంఘటనాత్మక లేదా శిక్షాత్మక హానులు, నష్టాలు లేదా లాభాలను కోల్పోవడం వంటి వాటితో సహా ఏ ఇతర హానులు లేదా నష్టాలు పునరుద్ధరించబడవని మీరు అర్థం చేసుకుని, అంగీకరించాలి. నష్టాల సంభావ్యత గురించి మాకు ముందే తెలిసినా లేదా తెలుసుకోగల అవకాశం ఉన్నా కూడా, మీకు కలిగిన నష్టాలకు మేము పరిహారం చెల్లించము మరియు 26 మరియు 27 విభాగాలలో పేర్కొన్న పరిమితులు మరియు మినహాయింపులు వర్తిస్తాయి. కొన్ని రాష్ట్రాలు లేదా ప్రాంతాలలో/భూభాగాలలో సంఘటనాత్మక లేదా పరిణామపూర్వక హానులపై మినహాయింపులు లేదా పరిమితులను అంగీకరించకపోవచ్చు, కనుక ఎగువ పరిమితులు లేదా మినహాయింపులు మీకు వర్తించకపోవచ్చు.
చట్టం ద్వారా అనుమతించబడిన గరిష్ట పరిధి మేరకు, స్టోర్, సేవలు లేదా ఏదైనా ఉత్పత్తి లేదా సేవతో పాటు కంటెంట్‌ని కోల్పోవడం, ఏదైనా వైరస్ లేదా మాల్వేర్ కారణంగా స్టోర్ లేదా సేవల యొక్క మీ ఉపయోగంపై ప్రభావం చూపడం లేదా స్టోర్ నుండి పొందిన ఏదైనా ఉత్పత్తి లేదా సేవపై దుష్ప్రభావం చూపడం వాటితో సహా అన్ని దావాలకు ఈ పరిమితులు మరియు మినహాయింపులు వర్తిస్తాయి; మరియు పరివర్తనాలు లేదా లావాదేవీలను ప్రారంభించడం లేదా పూర్తి చేయడంలో జాప్యాలు లేదా వైఫల్యాలకు కూడా వర్తిస్తాయి.
28. ఈనిబంధనలప్రతిక్షేపణ. సంబంధితచట్టంద్వారాఅనుమతించబడినగరిష్టపరిధిమేరకు.ఈ విక్రయాల నిబంధనలలోని అన్ని భాగాలు వర్తిస్తాయి; మీరు నివాసం ఉంటున్న స్థానం (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఉన్న స్థానం)లో మీకు ఇంతకంటే మెరుగైన హక్కులు ఉండవచ్చు. న్యాయస్థానం లేదా మధ్యవర్తి మేము ఈ నిబంధనల్లోని ఒక భాగాన్ని అమలు చేయలేమని వ్రాతపూర్వకంగా తెలియజేస్తే, మేము సంబంధిత చట్టం ద్వారా అనుమతించబడే పరిధి వరకు ఆ నిబంధనలను సారూప్య నిబంధనలతో భర్తీ చేస్తాము, కానీ మిగిలిన నిబంధనల్లో మార్పు ఉండదు. ఈ విక్రయాల నిబంధనలు పూర్తి మీ మరియు మా ప్రయోజనాల కోసం మాత్రమే ఏర్పాటు చేయబడ్డాయి; Microsoft యొక్క ఉత్తరాధికారులు మరియు అధికారిక వ్యక్తులు మినహా ఏ ఇతర వ్యక్తులకు ఏ రకమైన ప్రయోజనాలు కలగవు. మీరు ఇతర Microsoft వెబ్‌సైట్‌ల నుండి ఉత్పత్తులు లేదా సేవలను కొనుగోలు చేసినప్పుడు ఇతర నిబంధనలు వర్తించవచ్చు.
29. కేటాయింపు. స్థానిక చట్టాలు అనుమతించిన పరిధి మేరకు, మీకు ముందస్తు గమనిక లేకుండానే, ఏ సమయంలో అయినా మేము ఈ నిబంధనలను కేటాయించవచ్చు, ఈ నిబంధనల ప్రకారం మాపై ఉన్న బాధ్యతలకు ఉప-కాంట్రాక్ట్ ఇవ్వవచ్చు లేదా ఈ నిబంధనల ప్రకారం మాకు ఉన్న హక్కులకు ఉప-లైసెన్స్ అందించవచ్చు. మేము ఈ విక్రయాల నిబంధనల ప్రకారం ఏ హక్కులను కేటాయించము లేదా బదిలీ చేయము.
30. గమనికలుమరియుకమ్యూనికేషన్. కస్టమర్ మద్దతు విచారణలకు సంబంధించి, దయచేసి స్టోర్‌లో విక్రయాలు మరియు మద్దతు పేజీని చూడండి. వివాదాలకు సంబంధించి, ఈ విభాగంలోని నోటీసు ప్రక్రియలను అనుసరించండి.
31. కాంట్రాక్ట్చేసుకుంటున్నసంస్థ, చట్టపరమైనఎంపికమరియువివాదాలపరిష్కారస్థలం.
a. యునైటెడ్స్టేట్స్మరియుకెనడావెలుపలఉత్తరలేదాదక్షిణఅమెరికా. మీరు యునైటెడ్ స్టేట్స్ మరియు కెనడా వెలుపల ఉత్తర లేదా దక్షిణ అమెరికాలో నివస్తిస్తుంటే (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంటే), మీరు Microsoft Corporation, One Microsoft Way, Redmond, WA 98052, U.S.Aతో కాంట్రాక్ట్‌ని పొందాలి. చట్ట ప్రకారం వర్తించే విషయాలతో సంబంధం లేకుండా ఈ విక్రయాల సమూహాలు మరియు వాటిని ఉల్లంఘనలకు సంబంధించిన దావాలు వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ద్వారా పర్యవేక్షించబడతాయి. మేము మీ సేవలను దారి మళ్లించే దేశం యొక్క చట్టాలద్వారా అన్ని ఇతర దావాలు (వినియోగదారు రక్షణ, చట్టవ్యతిరేకమైన పోటీ మరియు మోసపూరితమైన దావాలతో సహా) నిర్వహించబడతాయి.
b. మధ్యతూర్పులేదాఆఫ్రికా. మీరు మధ్య తూర్పు లేదా ఆఫ్రికాలో నివస్తిస్తుంటే (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంటే), మీరు Microsoft Ireland Operations Limited, The Atrium Building, Block B, Carmanhall Road, Sandyford Industrial Estate, Dublin 18, Irelandతో కాంట్రాక్ట్‌ని పొందాలి. చట్టాలలోని నియమాలతో ఉన్న వైరుధ్యాలతో సంబంధం లేకుండా, ఈ విక్రయాల నిబంధనల యొక్క ప్రతిక్షేపన మరియు వాటి ఉల్లంఘనలకు సంబంధించిన దావాలు ఐర్లాండ్ యొక్క చట్టాల ద్వారా పర్యవేక్షించబడతాయి. మేము మీ సేవలను దారి మళ్లించే దేశం యొక్క చట్టాల ద్వారా అన్ని ఇతర దావాలు (వినియోగదారు రక్షణ, చట్టవ్యతిరేకమైన పోటీ మరియు మోసపూరితమైన దావాలతో సహా) నిర్వహించబడతాయి. స్టోర్ లేదా ఈ నిబంధనలకు సంబంధించి ఏర్పడే అన్ని వివాదాలను పరిష్కరించడంలో మొట్టమొదటి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం కోసం మీరు మరియు మేము ఐర్లాండ్ శాశ్వత హక్కులు అందించాలి.
c. దిగువపేర్కొన్నదేశాలుమినహాఆసియాలేదాదక్షిణపసిఫిక్. మీరు (చైనా, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా లేదా తైవాన్‌లో కాకుండా) ఆసియాలో నివస్తిస్తుంటే (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంటే), మీరు Microsoft Regional Sales Corporation, U.S.Aలో నెవడా రాష్ట్రం చట్టాల కింద సంఘటితం చేయబడిన సంస్థతో కాంట్రాక్ట్‌ని పొందాలి మరియు దీని శాఖలు సింగపూర్ మరియు హాంగ్ కాంగ్‌లో ఉన్నాయి మరియు ప్రధాన కార్యాలయం 438B Alexandra Road, #04-09/12, Block B, Alexandra Technopark, Singapore, 119968లో ఉంది. చట్ట ప్రకారం వర్తించే విషయాలతో సంబంధం లేకుండా ఈ విక్రయాల సమూహాలు మరియు వాటిని ఉల్లంఘనలకు సంబంధించిన దావాలు వాషింగ్టన్ రాష్ట్ర చట్టాల ద్వారా పర్యవేక్షించబడతాయి. మేము మీ సేవలను దారి మళ్లించే దేశం యొక్క చట్టాల ద్వారా అన్ని ఇతర దావాలు (వినియోగదారు రక్షణ, చట్టవ్యతిరేకమైన పోటీ మరియు మోసపూరితమైన దావాలతో సహా) నిర్వహించబడతాయి. ఈ నిబంధనలు లేదా సేవల నుండి లేదా వీటికి సంబంధించి ఏర్పడే వివాదంతో పాటు, వాటి ఉనికి, ప్రమాణీకరణ లేదా శాశ్వత రద్దుకు సంబంధించిన ఏదైనా ప్రశ్నను సింగపూర్ అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రం (SIAC) యొక్క మధ్యవర్తిత్వం నియమాలకు అనుగుణంగా సింగపూర్‌లో మధ్యవర్తిత్వానికి సూచించబడతాయి మరియు చివరిగా వారి ద్వారా పరిష్కరించబడతాయి. ట్రిబ్యునల్‌లోని ఒక మధ్యవర్తిని SIAC యొక్య అధ్యక్షులు నియమిస్తారు. మధ్యవర్తిత్వం అనేది ఇంగ్లీష్ భాషలో ఉంటుంది. మధ్యవర్తి యొక్క నిర్ణయం అంతిమం, దానికి కట్టుబడి ఉండాలి మరియు వివాదరహితంగా ఉండాలి, ఏ దేశం లేదా ప్రాంతంలో అయినా తీర్పు కోసం దీన్ని ప్రాతిపదికగా తీసుకోవచ్చు.
d. జపాన్. మీరు జపాన్‌లో నివస్తిస్తుంటే (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంటే), మీరు Microsoft Japan Co., Ltd (MSKK), Shinagawa Grand Central Tower, 2-16-3 Konan Minato-ku, Tokyo 108-0075తో కాంట్రాక్ట్‌ని పొందాలి. ఈ విక్రయాల నిబంధనలు మరియు వాటికి లేదా స్టోర్‌కు సంబంధించిన విషయాలు జపాన్ చట్టాల ద్వారా పర్యవేక్షించబడతాయి.
e. రిపబ్లిక్ఆఫ్కొరియా. మీరు రిపబ్లిక్ ఆఫ్ కొరియాలో నివస్తిస్తుంటే (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంటే), మీరు Microsoft Korea, Inc., 11th Floor, Tower A, K-Twin Tower, Jongro 1 gil 50, Jongro-gu, Seoul, Republic of Korea, 110-150తో కాంట్రాక్ట్‌ని పొందాలి. ఈ విక్రయాల నిబంధనలు మరియు వాటికి లేదా స్టోర్‌కు సంబంధించిన విషయాలు రిపబ్లిక్ ఆఫ్ కొరియా చట్టాల ద్వారా పర్యవేక్షించబడతాయి.
f. తైవాన్. మీరు తైవాన్‌లో నివస్తిస్తుంటే (లేదా మీ వ్యాపార ప్రధాన కేంద్రం ఇక్కడ ఉంటే), మీరు Microsoft Taiwan Corporation, 18F, No. 68, Sec. 5, Zhongxiao E. Rd., Xinyi District, Taipei 11065, Taiwanతో కాంట్రాక్ట్‌ని పొందాలి. ఈ విక్రయాల నిబంధనలు మరియు వాటికి లేదా స్టోర్‌కు సంబంధించిన విషయాలు తైవాన్ చట్టాల ద్వారా పర్యవేక్షించబడతాయి. Microsoft Taiwan Corporationకు సంబంధించిన మరిన్ని వివరాలను పొందాలంటే, దయచేసి ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ R.O.C. యొక్క వెబ్‌సైట్‌ని వీక్షించండి. (https://gcis.nat.gov.tw/main/index.jsp). తైవాన్ చట్టాల ద్వారా అనుమతించబడే గరిష్ట పరిధి మేరకు, స్టోర్ లేదా ఈ నిబంధనలకు సంబంధించి ఏర్పడే అన్ని వివాదాలను పరిష్కరించడంలో మొట్టమొదటి న్యాయపరమైన చర్యలు తీసుకోవడం కోసం మీరు మరియు మేము తైవాన్ తైపీ జిల్లా న్యాయస్థానాన్ని శాశ్వత హక్కులు అందించాలి.
32. గమనికలు.
a. మేధోపరమైనఆస్తిహక్కులయొక్కదావాలనుసమర్పించడంకోసంనోటీసులుమరియుప్రక్రియలు. మూడవ పక్షాల మేధోపరమైన ఆస్తి హక్కులను Microsoft గౌరవిస్తుంది. మీరు ఏదైనా మేధోపరమైన ఆస్తి ఉల్లంఘనతో సహా కాపీరైట్ ఉల్లంఘన దావాలను సమర్పించాలనుకుంటే, దయచేసి ఉల్లంఘన నోటీసులను సమర్పించడం కోసం మా ప్రక్రియలను అనుసరించండి(https://www.microsoft.com/info/cpyrtInfrg.aspx). ఈ ప్రక్రియకు సంబంధం లేని ఏ విచారణలకు ప్రతిస్పందన లభించదు.
అధ్యాయం 17, యునైటెడ్ స్టేట్స్ కోడ్స్, విభాగం 512లో పేర్కొన్న ప్రక్రియలకు అనుగుణంగా కాపీరైట్ ఉల్లంఘన నోటీసులకు Microsoft ప్రతిస్పందిస్తుంది. సముచిత సందర్భాలలో, పునరావృతంగా ఉల్లంఘనలకు పాల్పడుతున్న Microsoft సేవల యొక్క వినియోగదారుల ఖాతాలను Microsoft నిలిపివేయవచ్చు లేదా శాశ్వతంగా రద్దు చేయవచ్చు.
b. కాపీరైట్మరియువ్యాపారచిహ్నగమనికలు.
స్టోర్ మరియు సేవల్లో ఉన్న మొత్తం కంటెంట్ ©2016 Microsoft Corporation మరియు/లేదా దాని సరఫరాలు మరియు మూడవ పక్ష ప్రదాతలు, One Microsoft Way, Redmond, WA 98052, USAకి కాపీరైట్ చేయబడ్డాయి. అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి. స్టోర్‌లు, సేవలు మరియు కంటెంట్ అనేవి మాకు లేదా మా సరఫరాదారులు మరియు ఇతర మూడవ పక్ష ప్రదాతల యొక్క స్వంతం, కాపీరైట్ మరియు ఇతర మేధోపరమైన ఆస్తి హక్కులు కూడా మేము కలిగి ఉంటాము. Microsoft మరియు అన్ని Microsoft ఉత్పత్తులు మరియు సేవల యొక్క పేర్లు, లోగోలు మరియు చిహ్నాలు అనేవి యునైటెడ్ స్టేట్స్, కెనడా మరియు/లేదా ఇతర దేశాల్లో ఉన్న Microsoft యొక్క వ్యాపారచిహ్నాలు లేదా నమోదిత వ్యాపారచిహ్నాలు.
Microsoft వ్యాపారచిహ్నాల యొక్క జాబితాను ఇక్కడ కనుగొనవచ్చు: https://www.microsoft.com/trademarks. వాస్తవ కంపెనీలు మరియు ఉత్పత్తులు యొక్క పేర్లు అనేవి సంబంధిత యజమానుల యొక్క వ్యాపారచిహ్నాలుగా పరిగణించబడతాయి. ఈ విక్రయాల నిబంధనల మంజూరు చేయబడిన అన్ని హక్కులు ప్రత్యేకించబడ్డాయి.
33. భద్రతాహెచ్చరిక. గాయం, అసౌకర్యం లేదా కళ్లపై ఒత్తిడి వంటి వాటిని నివారించడం కోసం, ప్రత్యేకించి వీటిని ఉపయోగించడం వల్ల మీకు ఏదైనా నొప్పి లేదా కళ్లు తిరుగుతున్న భావన కలిగితే గేమ్‌లు ఆడుతున్నప్పుడు లేదా ఇతర అనువర్తనాలను ఉపయోగిస్తున్నప్పుడు మీరు కాలానుగుణంగా విరామాలు తీసుకోవాలి. మీకు అసౌకర్యంగా ఉంటే, విరామం తీసుకోండి. అసౌకర్యం అంటే వికారం, కదలలేకపోవడం, మైకము, స్థితిభ్రాంతి, తలనొప్పి, అలసట, కళ్లపై ఒత్తిడి లేదా కళ్లు పొడిబారడం వంటివి. అనువర్తనాలను ఉపయోగిస్తున్నప్పుడు మీ దృష్టి మరలవచ్చు మరియు మీరు పరిసరాలను పట్టించుకోకపోవచ్చు. జారిపడే ప్రమాదాలకు, మెట్లు, తక్కువ ఎత్తున్న సీలింగ్‌లకు, నష్టం జరిగే అవకాశం ఉన్న సున్నితమైన లేదా విలువైన వస్తువులకు దూరంగా ఉండండి. అప్లికేషన్‌లలో కనిపించే ఫ్లాఫింగ్ లైట్‌ల వంటి వాస్తవిక చిత్రాలు లేదా నమూనాల కారణంగా అతి తక్కువ మంది వ్యక్తులకు మూర్ఛ వంటి భావనలు కలగవచ్చు. మునుపు ఎప్పుడూ మూర్ఛ ఏర్పడని వ్యక్తులకు కూడా నిర్ధారించలేని కారణాల వల్ల మూర్ఛ ఏర్పడవచ్చు. తల తిరగడం, దృష్టి లోపం, అవయవాల సంకోచం, కుదుపు లేదా వణుకు, గందరగోళం, స్పృహ కోల్పోవడం లేదా మూర్ఛ వంటి లక్షణాలు ఉండవచ్చు. మీకు ఈ లక్షణాల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే ఉపయోగాన్ని ఆపివేసి, వైద్యులను సంప్రదించండి లేదా మూర్ఛకు దారితీసే ఏవైనా లక్షణాలు ఏర్పడుతున్నప్పుడు అప్లికేషన్‌లను ఉపయోగించడానికి ముందు వైద్యులను సంప్రదించండి. పిల్లలు అప్లికేషన్‌లను ఉపయోగిస్తున్నప్పుడు లేదా వారి లక్షణాలను తల్లిదండ్రులు పర్యవేక్షించాలి.